సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మూడు సర్ప్రైజ్ లు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రేపు మహేష్ పుట్టినరోజు కాగా… నేడు “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” ప్రోమోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
Read Also : వివాదంలో మణిరత్నం “నవరస”
అంతేకాదు ఈ వీడియోపై రివ్యూ కూడా ఇచ్చేశారు. “జస్ట్ “సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్” ఫైనల్ చూశాను. బూమ్… ది ఎర్లీ మార్నింగ్ అడ్రినలిన్ రష్ క్రషుడ్ మై మైండ్. మహేష్ బాబు ట్విట్టర్ లో సునామీ సృష్టించబోతున్నారు. సిద్ధంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ రికార్డులు సృష్టించింది. మరి రేపు సూపర్ స్టార్ అభిమానులు ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందనున్న మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది.
