Site icon NTV Telugu

God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్‌లు

Thaman

Thaman

God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్‌ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే గాడ్‌ ఫాదర్ మూవీ సంగీత దర్శకుడు తమన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బీజీఎం అచ్చం వరుణ్ తేజ్ ‘గని’ టైటిల్ సాంగ్‌లా ఉందని కొందరు నెటిజన్‌లు వీడియోలు షేర్ చేస్తున్నారు. గని టైటిల్ సాంగ్‌ మ్యూజిక్‌ను తమన్ మక్కీకి మక్కీ దించేశాడని, ఈ టీజనక చూసిన వాళ్లకు ఈ విషయం ఈజీగా తెలిసిపోతోందని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే గని సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది కూడా తమనే కావడం కొసమెరుపు. తన సినిమా నుంచి తానే కాపీ కొట్టినా.. రెండు మెగా కాంపౌండ్ సినిమాలే అయినా తమన్ ఇలా చేయడం తప్పు అని పలువురు హితబోధ చేస్తున్నారు.

Read Also: Movies Shooting: గుడ్‌న్యూస్.. ఆ చిత్రాల షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్

అటు మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ఆచార్య భారీ స్థాయి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్‌ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ జరగడం సరికాదని.. తమన్ మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని మెగా అభిమానులు సూచిస్తున్నారు. కాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గాడ్‌ ఫాదర్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version