NTV Telugu Site icon

Varasudu: క్లీన్ ‘U’ సర్టిఫికేట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన విజయ్

Varasudu

Varasudu

దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సినిమాకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ లభించింది. తమిళనాడులో ‘వారసుడు’ ప్రీమియర్స్ కి దళపతి విజయ్ ఫాన్స్ ఒకరోజు ముందు నుంచే థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. పొంగల్ ని కొంచెం ముందే తెస్తూ వారసుడు సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం కోలీవుడ్ సినీ అభిమానుల్లో ఉంది. అయితే విజయ్ సినిమాకి, అజిత్ నటిస్తున్న ‘తునివు’ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతుండడంతో అజిత్, విజయ్ అభిమానుల ఫ్యాన్ వార్ తో కోలీవుడ్ టెంపరేచర్ రైజ్ అయ్యింది. వారసుడు జనవరి 11నే తెలుగులో కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ 14కి పోస్ట్ పోన్ అయ్యింది.

తెలుగులో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ ఉండడంతో దిల్ రాజు ‘వారసుడు’ సినిమాని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకి థియేటర్స్ విషయంలో ఊరట లభించింది. అయితే వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి హిట్ కొడతాము అని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇందుకు కారణం పండగ సీజన్ లో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్లే అలవాటు మన ఆడియన్స్ కి ఉండడమే. ఏదైనా పండగ వస్తే మన ఆడియన్స్ ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తారు. వారసుడు సినిమా ఫ్యామిలీ జోనర్ లోనే తెరకెక్కింది కాబట్టి కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించే అవకాశం ఉంది. అయితే తెలుగు సినిమాలు సాలిడ్ హిట్ టాక్ సాదిస్తే వారసుడు సినిమాని మన ఆడియన్స్ ఎంతవరకూ చూస్తారు అనేది చూడాలి.

Show comments