Site icon NTV Telugu

Thalapathy68: అక్కినేని వారసుడుకు ప్లాప్ ఇచ్చినా మంచి ఛాన్సే పట్టేశాడే

Vijay

Vijay

Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఎసిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు. ఇక అయినా అధైర్యపడకుండా ఎలాగైనా ఈసారి అభిమానులను మెప్పించాలని.. పరాజయం ఎరుగని దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఇంకా ఫినిష్ కూడా చేయకుండానే విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. కోలీవుడ్ స్టార్డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో Thalapathy68 మొదలు కానుందని మేకర్స్ ప్రకటించారు. AGS బ్యానర్ పై ఈ చిత్రాన్ని అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిసున్నాడు.

Nayanthara: నయనతార మల్టీప్లెక్స్.. ఎక్కడో తెలుసా..?

ఒకప్పుడు వెంట ప్రభు అంటే తెలుగువారికి అంతగా పరిచయం లేదు. అయితే ఈ మధ్యనే ఆయన తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య- కృతిశెట్టి జంటగా వచ్చిన కస్టడీ సినిమాతో తెలుగులో సుపరిచితుడిగా మారాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న వెంకట్ ప్రభు.. తెలుగులో మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఎంత పరాజయాన్ని అందుకున్నా.. విజయ్ తో సినిమా తీసే ఛాన్స్ ను అందుకున్నాడు. ఇదొక ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ మూవీ అని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి అక్కినేని హీరోకు పరాజయాన్ని ఇచ్చిన వెంకట్ ప్రభు.. విజయ్ కు విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Exit mobile version