Site icon NTV Telugu

Thalapathy67: బ్లడ్ షేడ్ పోస్టర్ తోనే హైప్ ఎక్కిస్తే.. టైటిల్ తెలిస్తే తట్టుకోలేరేమో

Viajy

Viajy

Thalapathy67: ఒక కాంబో హిట్ అయ్యాకా.. అదే కాంబో రీపీట్ అయితే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. ప్రస్తుతం దళపతి 67 పై అంచనాలు అభిమానులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన మాస్టర్ సూపర్ హిట్ ను సొంతం చేసుకొంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నిన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా ప్రియా ఆనంద్, అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. విజయ్ కు ధీటైన విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Brahmanandam: అందుకేనయ్యా నిన్ను జనం గుర్తుపెట్టుకొనేది..

కాగా, తాజాగా అనిరుద్.. విజయ్ పోస్టర్ ను ఒకటి షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 3 .. అనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దాంతో పాటు అనిరుధ్ షేర్ చేసిన ఫోటో బిహ్మణులకు హైప్ ఎక్కిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్లడ్ షేడ్ ఆర్ట్ తో పబ్లిసిటీ డిజైనర్ గోపీ ప్రసన్న ఈ పోస్టర్ ని బ్రష్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూస్తూనే అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఒక పోస్టర్ కే ఇంతలా హైప్ ఎక్కిస్తే.. టైటిల్ తెలిస్తే తట్టుకోలేరేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఆ టైటిల్ ఎలా ఉంటుంది.. దానికి అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Exit mobile version