Jason Sanjay: బ్రేకింగ్: డైరెక్టర్ అవుతున్న స్టార్ హీరో కొడుకు.. మొదటి సినిమా ఎవరితో అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay Son Jason Sanjay Directorial Debut with Lyca Productions : తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్ మరోసారి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ఆయన కుమారుడి కారణంగా వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కుమారులందరూ హీరోలుగా మారుతూ ఉంటే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్ గా మారుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన అగ్రిమెంట్లు పూర్తి కాగా ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి హీరో అజిత్ మేనేజర్ శరత్ చంద్ర కూడా సహ నిర్మాతగా వ్యవహరించబోతూ ఉండడమే. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసిన ఫోటోలతో పాటు శరత్ చంద్ర పేరు, ఆయన పిఆర్ ఏజెన్సీ పేరు కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ సినిమాకి ఆయన పిఆర్ మేనేజర్ గా వ్యవహరించబోతున్నారా లేక సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లేదా ఇతర నటీనటులకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే తమిళ సోషల్ మీడియాలో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది ఏమిటంటే ఈ సినిమాలో విక్రమ్ కుమారుడు ధ్రువ విక్రమ్ హీరోగా నటించే అవకాశం ఉందని ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి విజయ్ తండ్రి చంద్రశేఖర్ గతంలో దర్శకుడిగా పలు హిట్ సినిమాలు తెరకెక్కించారు. తమిళంలోనే కాదు తెలుగులో సైతం ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు సంజయ్ తన తండ్రి బాటలో కాకుండా తాత బాటలో నడుస్తూ ఉండడంతో తాత లెగసీ కంటిన్యూ చేయబోతున్నాడా అనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాక తండ్రి హీరో కావడంతో తండ్రిని డైరెక్ట్ చేసే అవకాశం ఉందా అని చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ చర్చలన్నింటికీ బ్రేకులు పడాలంటే లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తప్ప సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
We are beyond excited 🤩 & proud 😌 to introduce #JasonSanjay in his Directorial Debut 🎬 We wish him a career filled with success & contentment 🤗 carrying forward the legacy! 🌟#LycaProductionsNext #JasonSanjayDirectorialDebut @SureshChandraa @DoneChannel1 @gkmtamilkumaran… pic.twitter.com/wkqGRMgriN
— Lyca Productions (@LycaProductions) August 28, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..