Vijay: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌కు ఆయన భార్య సంగీత బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలిన కోర్టుకెక్కింది. తన భర్త విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. విజయ్ , సంగీతలకు ఆగస్టు 25, 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లయిన 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నుంచి సంగీత విజయ్‌తో విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. విజయ్ ఇటీవల ఓ స్టార్ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత విడాకులు కోరడం తమిళనాట సంచలనంగా మారింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్, తన పార్టీ టీవీకే ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో భార్య విడాకులు కోరారు. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించనుంది.
Vijay: “విజయ్‌కు ఎఫైర్ ఉంది”.. విడాకులు కోరిన దళపతి భార్య
- విడాకులు కోరిన విజయ్ భార్య..
- తన భర్తకు ఎఫై ర్ ఉందని పిటిషన్..
- తలపతి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు..

Vijay