పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాని కబ్జా చేసింది. #Leo కౌంట్ డౌన్ తో ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన ఫ్యాన్స్… మరో 40 రోజుల్లో లియో రాబోతుంది అంటూ హంగామా చేస్తున్నారు. 40 డేస్ కి ముందే ఈ రేంజ్ హంగామాని కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చూడలేదు. లియో డైరెక్ట్ చేస్తుంది లోకేష్ కనగరాజ్ అవ్వడం…. లియో కోసం అభిమానులు మాత్రమే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా వెయిట్ చేసేలా చేస్తోంది.
ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ‘బుల్స్ ఐ’ని హిట్ చెయ్యడంలో మిస్టేక్ జరిగింది. ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేష్ కనగరాజ్, పాన్ ఇండియా సంభవం సృష్టించడానికి రెడీ అయ్యాడు. 90 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన లియో చిత్ర యూనిట్, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిల్లో బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకోవాలనేది లియో డైరెక్టర్-హీరో ప్లాన్… ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాపై అంచనాలని పెంచారు. దాని రిజల్ట్ ఏంటో ఈరోజు లియో సినిమాపై ఉన్న హైప్ చూస్తే అర్ధమవుతుంది. మోస్ట్ అవైటెడ్ కోలీవుడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన లియో మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.
