Leo: హిందీలో రిలీజ్ లేదు… నార్త్ మార్కెట్ పోయినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, లేటెస్ట్ గా లియో సినిమా ట్రైలర్ ని వదిలి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. లోకేష్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్, సంజయ్ దత్-అర్జున్ సర్జా టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ లియో ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి. ట్రైలర్ తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసిన లియో చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాని నార్త్ బెల్ట్ లో ఉన్న మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదు. లియో సినిమా హిందీ వెర్షన్ నార్త్ లోని ఏ మల్టీప్లెక్స్ రిలీజ్ చేయడానికి రెడీగా లేవట. ఎందుకంటే నార్త్ బెల్ట్ లో ఉన్న మల్టీప్లెక్స్ లలో ఉన్న రూల్ ప్రకారం… ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మినిమమ్ ఎనిమిది వారాల గ్యాప్ అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలట.
అలా కాకుండా నెలకో, ఆరు వారాలకో ఓటీటీలోకి ఇచ్చేస్తాం అంటే మాత్రం మల్టీప్లెక్స్ లు ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావు. లియో సినిమా కూడా నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకుందట. ఈ కారణంగానే నార్త్ లో లియో హిందీ రిలీజ్ కి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ విషయం బయటకి రావడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WeWantLeoHindiInMultiplex ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్న విజయ్ కి లియో నార్త్ లో రిలీజ్ కాకపోవడం పెద్ద షాక్ అనే చెప్పాలి. పైగా ఇది చాలదన్నట్లు లియో రిలీజ్ అవుతున్న రోజే నార్త్ లో అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన గణపత్ సినిమా విడుదల కానుంది. ఒకవేళ మల్టీప్లెక్స్ లో రిలీజ్ దొరికినా కూడా లియో మూవీకి గణపత్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం గ్యారెంటీ.
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!