Vijay: సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది కానీ, హీరోల అభిమానుల మధ్య మాత్రం ఆ పోటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరో.. మరో హీరో సాంగ్ కకు డ్యాన్స్ వేసినా.. మరో హీరో డైలాగ్ చెప్పినా కూడా మా హీరో రేంజ్ అది .. మా హీరో రేంజ్ ఇది అని చెప్పుకొస్తారు. ప్రస్తుతం బన్నీ అభిమానులు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే.. బన్నీ సాంగ్ కు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్టెప్స్ వేశాడు కాబట్టి. అవునా.. నిజమా..? అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం తెలుసుకుందాం పదండి. నిన్న విజయ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం విజయ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే , విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక రేర్ వీడియో ను షేర్ చేసింది. ఆ వీడియోలో విజయ్, పూజా, ఇద్దరు చిన్నారులతో కలిసి బుట్టబొమ్మ సాంగ్ కు స్టెప్స్ వేస్తూ కనిపించాడు.
Ram Charan: నా కూతురు అచ్చు నాలాగే ఉంది.. పేరు ఏంటంటే..?
ఇక ఈ వీడియో ను షేర్ చేస్తూ పూజా..” ఈ చిన్నారులతో బుట్టబొమ్మకు డ్యాన్స్ చేస్తున్న రేర్ వీడియో నా ఫోన్ లో ఉంది. నిన్న విజయ్ సర్ బబర్త్ డే కాబట్టి షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే విజయ్ తో కలిసి పూజా బీస్ట్ సినిమాలో నటించింది. ఆ షూటింగ్ సమయంలోనే ఈ వీడియో చేసినట్లు ఆమె తెలిపింది. ఇక బుట్టబొమ్మ సాంగ్.. లో కూడా పూజానే హీరోయిన్. అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన ఈ చిన్నది నటించి మెప్పించింది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్స్ లో ఒకటి. ఇక బన్నీ సాంగ్ కు విజయ్ డ్యాన్స్ వేయడంతో.. అది మా హీరో రేంజ్ అంటూ.. బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.