Site icon NTV Telugu

Beast Trailer : బీస్ట్.. విజయ్‌ అభిమానులకు ఫీస్ట్‌..

Beast Trailer

Beast Trailer

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 13న బీస్ట్ విడుద‌ల కానున్న‌ది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న తమిళస్టార్​ దళపతి విజయ్ ‘బీస్ట్​’ ట్రైలర్​ విడుదలైంది. ఉగాది పర్వదినం సందర్భంగా దాదాపు 2:56 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ట్రైలర్​లోని ప్రతి ఫ్రేమ్​అదుర్స్​ అనిపించేలా ఉంది. విజయ్​ను మరో లెవల్​లో చూపించారు దర్శకుడు. ట్రైలర్​.. సినిమాపై అంచనాలు మరింత పెంచిందనే చెప్పాలి. డైలాగ్​ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అన్న డైలాగ్​ ట్రైలర్​కు హైలెట్​గా నిలిచింది. దీంతో పాటు ఈ ట్రైలర్‌లో మ్యూజిక్‌ను అనురుద్‌ ఇరగదీశాడు. విజయ్‌ అభిమానులకు ఈ బీస్ట్‌.. వేసవికాలంలో ఫీస్ట్‌ చేయడం ఖాయమనిపిస్తోంది.

Exit mobile version