NTV Telugu Site icon

Thalapathy 66 : గ్రాండ్ లాంచ్… పూజా కార్యక్రమాలతో స్టార్ట్

Thalapathy 66

Thalapathy 66

తలపతి విజయ్ “బీస్ట్” గ్రాండ్ రిలీజ్ కి కేవలం వారం మాత్రమే ఉంది. అయితే “బీస్ట్” విడుదలకు ముందే విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. తాత్కాలికంగా “తలపతి 66” అని పిలుచుకుంటున్న ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు చెన్నైలో నటీనటులు, సిబ్బంది మధ్య సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక మందన్న, మ్యూజిక్ కంపోజర్ తమన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు మేకర్స్. ముందుగా సాంగ్ ను చిత్రీకరించబోతున్నారట. “తలపతి 66” పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్

ఏప్రిల్ 6న “తలపతి 66″లో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే . మంగళవారం రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ ను రివీల్ చేశారు. ఈ సినిమాతో ఆమె తొలిసారిగా విజయ్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. నిజానికి 2021 సెప్టెంబర్ లోనే విజయ్ తో వంశీ పైడిపల్లి తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కానీ మూవీ ప్రారంభోత్సవానికి ఇన్ని నెలలు సమయం పట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించనున్నారు.