Thalapathy 66 : గ్రాండ్ లాంచ్… పూజా కార్యక్రమాలతో స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలపతి విజయ్ “బీస్ట్” గ్రాండ్ రిలీజ్ కి కేవలం వారం మాత్రమే ఉంది. అయితే “బీస్ట్” విడుదలకు ముందే విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. తాత్కాలికంగా “తలపతి 66” అని పిలుచుకుంటున్న ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు చెన్నైలో నటీనటులు, సిబ్బంది మధ్య సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక మందన్న, మ్యూజిక్ కంపోజర్ తమన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు మేకర్స్. ముందుగా సాంగ్ ను చిత్రీకరించబోతున్నారట. “తలపతి 66” పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ఏప్రిల్ 6న “తలపతి 66″లో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే . మంగళవారం రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ ను రివీల్ చేశారు. ఈ సినిమాతో ఆమె తొలిసారిగా విజయ్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. నిజానికి 2021 సెప్టెంబర్ లోనే విజయ్ తో వంశీ పైడిపల్లి తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కానీ మూవీ ప్రారంభోత్సవానికి ఇన్ని నెలలు సమయం పట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించనున్నారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!