Site icon NTV Telugu

Rajinikanth: మాల్దీవుల్లో తలైవా.. అసలు ఆ వెల్ కమ్ ఏందీ మావా

Rajini

Rajini

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎవరు అనేది.. ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన సినిమాలు ఇక్కడే కాదు విదేశాల్లో కూడా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన రోజులు ఉన్నాయి. ఇక ఈ వయస్సులో కూడా రజినీ వరుస సినిమాలతో కుర్రహీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం తలైవా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో జైలర్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. లాల్ సలాం, టీజెజ్ఞానవేల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక రజినీ వరుస షూటింగ్స్ కు బ్రేక్ చెప్పి కొన్నిరోజులు వెకేషన్ కు చెక్కేశాడు. ఇప్పటివరకు రజినీ.. హిమాలయాలకు వెళ్లడం చూసాం.. గుళ్ళు, గోపురాలకు వెళ్లడం చూసాం. కానీ, ఈసారి మాత్రం రజినీ రూట్ మార్చాడు. మొట్టమొదటి సారి తలైవా.. మాల్దీవుల్లో అడుగుపెట్టాడు.

Vignesh Shivan: బేబీపై మనసు పడ్డ నయనతార భర్త.. ?
ఇక రజినీ అంటే స్వాగతం మాములుగా ఉండకూడదు కదా.. బోట్ దిగడం ఆలస్యం.. మేళతాళల మధ్య రజినీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆయన నడుస్తున్న నేలపై పూలు చల్లుతూ.. హోటల్ లోపలికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జూలై 16, 17 తేదీల్లో రజినీ వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారం క్రితం వెకేషన్ కు వెళ్లిన రజినీ .. నేడు ఇండియా తిరిగి వచ్చాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. జైలర్ ఆడియో లాంచ్ జరుగుతున్నా నేపథ్యంలో.. ఆ ఈవెంట్ ను అందుకోవడానికి వెకేషన్ ను పూర్తిచేసుకొని వచ్చేసాడు. ఇక ఎంతో సింపుల్ గా మాల్దీవ్స్ లో ఒక్కడే రజినీ ప్రశాంతతను ఎంజాయ్ చేస్తూ సమయం గడిపాడు. మరి ఈ జైలర్ సినిమాతో రజినీ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version