Site icon NTV Telugu

Thalaimai Seyalagam: శ్రియారెడ్డి లీడ్ రోల్ లో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్

Thalaimai Seyalagam

Thalaimai Seyalagam

Thalaimai Seyalagam to Stream in Zee 5 Soon: ZEE5లో స‌రికొత్త పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో అధికార దాహాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందిందని, 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై జాతీయ అవార్డ్ గ్ర‌హీత వ‌సంత‌బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాధికా శ‌ర‌త్ కుమార్ రూపొందించారని ప్రకటించారు. ఈ సిరీస్ లో కిషోర్‌, శ్రియారెడ్డి, ఆదిత్య మీన‌న్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనల‌ను తెలియ‌జేసే క‌థాంశంతో ఇది తెర‌కెక్కింది.

Thota Narasimham: అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్‌ సీఎం కావాలి..

త‌మిళ రాజ‌కీయాల చుట్టూ న‌డిచే క‌థాంశం అని ముఖ్య‌మంత్రి అరుణాచ‌లం అవినీతి ఆరోప‌ణ‌ల‌తో 15 సంవ‌త్స‌రాలుగా విచార‌ణ‌ను ఎదుర్కొంటుంటారని టీజర్ తో క్లారిటీ వచ్చింది. ముఖ్య‌మంత్రి కావాల‌ని, ఆ ప‌ద‌వి కోసం వారిలో ఇది కోరిక‌ను మ‌రింత‌గా పెంచుతుంది. ఇదిలా ఉండ‌గా జార్ఖండ్‌లోని మారుమూల ప‌ల్లెటూరులో, రెండు ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన పాత మ‌ర్డ‌ర్ కేసుని సీబీఐ ఆఫీస‌ర్ వాన్ ఖాన్ ప‌రిశోధిస్తుంటారు. అదే స‌మ‌యంలో చెన్న నగ‌నంలో త‌ల‌, శ‌రీర‌భాగాలు వేరు చేయ‌బ‌డిన ఓ శ‌రీరం దొరుకుతుంది. ఈ భ‌యంక‌ర ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని క‌నిపెట్ట‌టానికి చెన్నై డీజీపీ మ‌ణికంద‌న్ ప‌రిశోధ‌న చేస్తుంటారు. క్ర‌మ‌క్ర‌మంగా న‌గ‌రంలో జ‌ర‌ర‌గుతున్న ఈ దుర్ఘ‌ట‌న‌ల వెనుకున్న నిజ‌మేంట‌నేది బ‌య‌ట‌కు వ‌స్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

Exit mobile version