తల అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బోణీ కపూర్ ప్రొడ్యూస్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ హైప్ క్రియేట్ చెయ్యడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. భారి అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన తునివు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రీమియర్ షోస్, మార్నింగ్ షోస్ ఇప్పటికే కొన్ని సెంటర్స్ లో కంప్లీట్ అవ్వడంతో తునివు సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్ తునివు సినిమా పోయింది అంటుంటే అజిత్ ఫాన్స్ ఏమో సూపర్ హిట్ కొట్టాం అంటూ హల్చల్ చేస్తున్నారు. ఎప్పుడూ ఉండే ఈ ఫ్యాన్ వార్ ని కాసేపు పక్కన పెట్టి జనరల్ ఆడియన్స్ ఒపీనియన్స్ ని ఒకసారి చూస్తే… ‘తునివు’ సినిమా యాక్షన్ మూవీ, అజిత్ సూపర్బ్ గా పెర్ఫాం చేశాడు, బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి ఇచ్చిన మెసేజ్ బాగుంది, అజిత్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు, కథనం బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి అనే రివ్యూస్ వస్తున్నాయి.
సెకండ్ హాఫ్ ని కాస్త స్లో చేసి డైరెక్టర్ మెసేజ్ ఇవ్వడంతో ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారట. అయితే పండగ సీజన్ కంప్లీట్ యాక్షన్ మూవీ ఆడియన్స్ ని ఎంతవరకూ అట్రాక్ట్ చేస్తుంది అనే గమనించాల్సిన విషయం. ఫాన్స్ ని మాత్రమే కాకుండా యాక్షన్ సినిమాల లవర్స్ కి కూడా ఫుల్ మీల్స్ పెట్టగలిగే స్టఫ్ అయితే తునివు సినిమాలో ఉంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వస్తారా లేదా అనేది తెలియని అంటే కనీసం ఫస్ట్ వీక్ అయినా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే అజిత్ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందా లేదా అనే విషయం చెప్పగలం. ఇప్పటికైతే తునివు సినిమా యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది.