తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’, ‘కాసేదాన్ కడవులదాన్’, ‘గ్యాంగ్స్టా’ సాంగ్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ‘తునివు’పై అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేశారు. ఈ అంచనాలకి ఆకాశం కూడా సరిపోదు అన్నట్లు మేకర్స్ ‘తునివు’ మూవీ ట్రైలర్ ని న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. ‘తునివు డే’ అంటూ డిసెంబర్ 31 మొత్తం ‘తునిఉ’ ప్రమోషన్స్ తో మోతమోగించిన చిత్ర యూనిట్… ట్రైలర్ తో సోషల్ మీడియాని షేక్ చేశారు.
అజిత్ ని ముందెన్నడూ చూడనంత స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన హెచ్. వినోద్, తునివు ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశాడు. ‘ఖాకీ’ సినిమా తర్వాత ఆ రేంజ్ మూవీని తెరకెక్కించలేదు హెచ్. వినోద్. ఈసారి తునివు సినిమాతో ఆ లోటు తీరిపోయేలా చేసినట్లు ఉన్నాడు. బ్యాక్ రాబరీతో మొదలైన ట్రైలర్, బ్యాంక్ హీస్ట్ కథతో ఈ సినిమా రూపొందింది అనే క్లియర్ హింట్ ని ఇచ్చేసింది. ‘తునివు’ ట్రైలర్ మొత్తం గన్స్, గట్స్, బుల్లెట్స్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ నిండిపోయాయి. హీరోయిన్ మంజు వారియర్ కి కూడా సూపర్బ్ రోల్ పడినట్లు ఉంది. ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండడంతో అజిత్ ఫాన్స్ రిపీట్ మోడ్ లో ట్రైలర్ ని చూశారు. దీంతో 24 గంటలు కూడా అవ్వకుండానే 21 మిలియన్స్ వ్యూస్, 1.1 మిలియన్ లైక్స్ ని రాబట్టి ‘తునివు ట్రైలర్’ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటివరకూ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి పీక్ స్టేజ్ చూపించిన తునివు ట్రైలర్, జనవరి 11న గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టడానికి అవసరమైన గ్రౌండ్ ని రెడీ చేసింది ఇక అజిత్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడమే మిగిలింది.