దీపావళి సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ‘రాడికల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిందని టీం ప్రకటించింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకురాలిగా నీరజ కోన పరిచయమయ్యారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి రెండవ రోజు నుంచి ‘మౌత్ టాక్’ (మాట సాయం) బలంగా తోడవ్వడం, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల ప్రేక్షకులు అద్భుతమైన స్పందన ఇవ్వడం సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ‘తెలుసు కదా’ చిత్రం ఒక సమకాలీన అంశం, సున్నితమైన కోణం ఆధారంగా రూపొందించబడిన భావోద్వేగభరితమైన కథాంశాన్ని ఎక్స్ ప్లోర్ చేసింది.
Also Read : Thamma Movie Review: ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక మొదటి సినిమా ‘థామా రివ్యూ’
ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ నటన ప్రధానాంశంగా మారింది. సంక్లిష్టమైన, భావోద్వేగంతో కూడిన పాత్రలో ఆయన నటన, , ప్రామాణికత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కూడా గ్లామర్‌తో పాటు గంభీరతను జోడించే పాత్రల్లో తమదైన ముద్ర వేశారు. దీపావళి పండుగ సెలవుల కారణంగా ‘తెలుసు కదా’ థియేటర్లలో పట్టును నిలబెట్టుకుంది. ప్రస్తుత జోరు చూస్తుంటే, వారాంతపు రోజుల్లో కూడా సినిమా ఇదే బలమైన వసూళ్లను కొనసాగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
