Telugu Writer Anantha Sriram Lands In Trouble: మంచి గుర్తింపు ఉన్న ప్రముఖులు.. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాము మాట్లాడే పదాల్లో తప్పులు దొర్లకుండా, ఆచితూచి వ్యవహరించాలి. అలా కాకుండా.. తెలిసో, తెలియకో ఏదైనా తప్పు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిన్నటికి నిన్న.. దేవబ్రాహ్మణులను ఉద్దేశించిన బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ఆ కులం వారికి రావణుడే గురువు అని బాలయ్య చెప్పడంతో.. వాళ్లు నొచ్చుకున్నారు. దీంతో వెంటనే బాలయ్య ఫేస్‌బుక్ మాధ్యమంగా క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.
Naga Babu: పొత్తులు లేకుండా జనసేన పోటీ.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం
ఇప్పుడు సరిగ్గా అలాంటి వివాదంలోనే ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న శ్రీరామ్.. అక్కడ ప్రసంగించాడు. తన ప్రసంగంలో భాగంగా.. “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వినియోగించాడు. అంతే.. అదే అగ్గి రాజేసింది. ఆ వర్గం వారు శ్రీరామ్‌పై ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఎందుకంటే.. ఆ పదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. నిషేధించిన ఆ పదాన్ని శ్రీరామ్ తన ప్రసంగంలో చెప్పడంతో.. భట్రాజులు మండిపడుతున్నారు. తమ మనోభావాల్ని కించపరిచే విధంగా శ్రీరామ్ వ్యాఖ్యలు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత పదాన్ని ఉపయోగించినందుకు గాను.. శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు.
Brooke Shields: నటి ఆవేదన.. తెలిసిన వ్యక్తే కదా అని హోటల్‌కి వెళ్తే..
అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, తన తప్పును ముందే తెలుసుకొని, అనంత శ్రీరామ్ ఆ కులస్తులకు క్షమాపణలు చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వినియోగించలేదని, ఆ సమయంలో పొరపాటుగా అది వచ్చేసిందని వివరణ ఇచ్చాడు. ఆల్రెడీ సారీ చెప్పేశాడు కాబట్టి, ఈ వివాదం ఇక్కడితోనే సద్దుమణుగుతుందా? లేక ఇతర పరిణామాలకేమైనా దారి తీస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కి ఘోర అవమానం.. కూరలో కరివేపాకులా..
