తెలుగు ఆడియన్స్ బయటి భాషల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హిట్ చిత్రాలను వెంటనే చూసేయాలని ఆరాటపడి పోతున్నారు. ఇప్పటికే ఈ పల్స్ పట్టిన గీతా ఆర్ట్స్ కాంతారా లాంటి సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ వెంటనే కొని మనకు చూపించి ఫుల్ క్యాష్ చేసుకున్నారు. అక్కడి నుంచి పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ట్రెండింగ్ పేరుతో ముందుకొస్తూ కలెక్షన్స్ వసూల్ చేసుకుంటున్నాయి.
Also Read RAPO 22: ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ గ్లిమ్స్ అదిరింది
రీసెంట్ గా ఛావా ఫిలిం రైట్స్ ను లేటుగా కొని కూడా ఇదే సంస్థ క్యాష్ చేసుకుంది. సినిమా ట్రెండింగ్ లో ఉందనే ఒకే ఒక్క కారణంతో తెలుగు ఆడియన్స్ థియేటర్లకు ఎగబడి మరీ వెళ్లారు. సురేష్ ప్రొడక్షన్ సైతం ఇలా వచ్చే మలయాళ సినిమాలపై గత కొంతకాలంగా ఆసక్తి చూపిస్తోంది. తాజాగా బాలీవుడ్ అక్షయ్ కుమార్ నటించిన కేసరి పార్ట్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ ఇలాగే కొనుగోలు చేసి తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతుంది. అదే కేసరి ఛాప్టర్ 2. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన కేసరి ఛాప్టర్ 2 తెలుగులో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మే 23న టూ తెలుగు స్టేట్స్ లో ఈసినిమాను రిలీజ్ చేయబోతుంది. కేసరి ఛాప్టర్ 2 రిలీజ్ అయి దాదాపు నెల రోజులు అవుతోంది. పైగా అంతగా ట్రెండ్లో కూడా లేదు. అది తెలిసి కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరి మన తెలుగు ఆడియన్స్ ఈసినిమా చూడడానికి ఎంతవరకు థియేటర్లకు వెళ్తారో చూడాలి.
