Site icon NTV Telugu

Lalit Modi Biopic : ఐపీఎల్ పై తెలుగు నిర్మాత మూవీ

Lalit Modi Biopic

Lalit Modi Biopic

తెలుగు నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి వరుసగా బయోపిక్ లపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ బయోపిక్ తో మొదలైన ఆయన జీవిత కథల నిర్మాణం… ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయగాథ ఆధారంగా ’83’ అనే మూవీలతో కొనసాగింది. అయితే తాజాగా విష్ణు వర్ధన్ ఇందూరి మరో బయోపిక్ ను ప్రకటించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన “మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ సాగా” పుస్తకాన్ని వెండి తెరపైకి తీసుకురావడానికి తెలుగు నిర్మాత సన్నద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ IPL ఆధారంగా తెరకెక్కనుంది. ఐపీఎల్ కాన్సెప్ట్ వెనుక సూత్రధారి లలిత్ మోదీ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

Read Also : Sarkaru Vaari Paata : క్రేజీ అప్డేట్… ఏం జరుగుతోందంటే?

“మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ సాగా” పుస్తకాన్ని ఫీచర్ ఫిల్మ్‌గా మార్చనున్నట్లు విష్ణు ఇందూరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీలో నటించబోతున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చని విష్ణు తెలిపారు.

Exit mobile version