Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Telugu Indian Idol Ugadi Special Episode 2

Telugu Indian Idol: బాలయ్య పాటలతో ఉగాది స్పెషల్ ఎపిసోడ్!

Published Date :April 2, 2022 , 2:23 pm
By Prakash
Telugu Indian Idol: బాలయ్య పాటలతో ఉగాది స్పెషల్ ఎపిసోడ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చేసింది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే శుక్రవారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ డబుల్ ధమాకాను ఇచ్చింది. ఉగాది స్పెషల్ గా రూపుదిద్దుకున్న ఈ ఎపిసోడ్ లో శుక్రవారం కంటెస్టెంట్స్ ఐదుగురు నందమూరి బాలకృష్ణ సినిమా పాటలు పాడగా, ఒకరు నటరత్న ఎన్టీయార్ మూవీ పాట పాడారు. దాంతో నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగే పండగ అన్నట్టుగా మారిపోయింది.

శుక్రవారం టెలికాస్ట్ అయిన తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ ను న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు శ్రీరామచంద్ర, 12 మంది కంటెస్టెంట్స్ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, పాటతో ప్రారంభించారు. ఈ ఎపిసోడ్ నుండి సింగర్స్ కు జడ్జీలు పాయింట్స్ వేయడంతో పాటు వీక్షకుల నుండి వచ్చే ఓటింగ్స్ నూ పరిగణనలోకి తీసుకుంటారు. తక్కువ పాయింట్లు, ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేసేస్తారు. సో… మరింత ఏకాగ్రతతో పాటలు పాడాలని తమన్ కంటెస్టెంట్స్ ను కోరారు. మొదటగా శుక్రవారం లాలస ‘సమరసింహారెడ్డి’లోని ‘రావయ్యా ముద్దుల మావ’ పాటతో ఆకట్టుకుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కు జడ్జీలు బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ అభినందించారు. అలానే ఉగాది పండగను పురస్కరించుకుని లాలస మదర్ ఉగాది పచ్చడి తీసుకొచ్చి… అందరికీ పెట్టారు. ఎప్పుడూ తన కూతురును మెచ్చుకోని ఆమె తొలిసారి వేదికపై లాసన ను అప్రిషియేట్ చేయడంతో ఆమె కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలాలి.

Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్

‘ఖల్ నాయక్’ నిత్యామీనన్!
ఆ తర్వాత ప్రణతి ‘అఖండ’ మూవీలోని ‘హొయ్యా హొయ్యా ముద్దుల మావయ్యా…’ గీతాన్ని ఆలపించింది. విశేషం ఏమంటే తమన్ స్వరపరిచిన ఈ పాటను సినిమాలో తన తోటి సింగర్స్ తో కలిసి అదితి భావరాజు పాడింది. ఇక్కడ ఈ స్టేజ్ మీద ప్రణతి పాడుతుంటే… అదితి కోరస్ అందించింది. ఈ విషయాన్ని గ్రహించిన నిత్యామీనన్ అదితిని అభినందించింది. తన జీవితంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని ఈ సందర్భంగా సింగర్ కార్తీక్ గుర్తు చేసుకున్నాడు. మలేషియాలో బాలుగారు పాడిన పాటను ఆయన సమక్షంలోనే తాను మ్యూజిక్ కన్సర్ట్ లో పాడుతుంటే… ఆయన స్టేజ్ పైకి వచ్చి కోరస్ ఇచ్చారని కార్తీక్ తెలిపాడు. కాంపిటీషన్ మొదలయ్యే ముందు ప్రణతి ‘భీమ్లా నాయక్’లో నిత్యామీనన్ సంభాషణలను ప్రాక్టీస్ చేస్తూ తనకు కనిపించిందని శ్రీరామ్ చంద్ర చెప్పాడు. దాంతో ఆమె ఆ సినిమాలోని నిత్యామీనన్ డైలాగ్స్ ను చెప్పింది. ‘ఈ సినిమాలో తనను పవన్ కళ్యాణ్‌ కాఫీ అడగగానే ‘బయటకు పోయి తాగు’ అంటూ చెప్పిన డైలాగ్ ఇష్టమని, అది స్క్రిప్ట్ లో లేకపోయినా స్పాంటేనియస్ గా చెప్పాన’ని నిత్యామీనన్ తెలిపింది. పవన్ ‘నాయక్’ అయితే… నిత్యా మీనన్ ‘ఖల్ నాయక్’ అంటూ తమన్ సరదాగా ఆటపట్టించాడు. ఆమె ‘కళ్ళతో నటించే నాయక్’ అంటూ శ్రీరామ్ చంద్ర ఆ మాటను సవరించాడు. దాంతో ‘ఒరేయ్ భజన చేయడం ఆపరా’ అంటూ తమన్ నవ్వుతూ సెటర్ వేశాడు.

మూడో కంటెస్టెంట్ మారుతి ‘నరసింహనాయుడు’ మూవీలోని ‘కొ క్కొ క్కోమలి’ పాటను పాడి ఆకట్టుకున్నాడు. మారుతీ డ్రెస్ ను తమన్ మెచ్చుకుంటూ ‘నీదీ నాది ఒకేలాంటి డ్రస్. సాయంత్రం ఎవరైనా మ్యారేజ్ పార్టీ వాళ్ళు ఐదొందలు బేటా ఇస్తానంటే వెళ్ళి షెహనాయ్ వాయించి వద్దాం’ అంటూ జోక్ చేశాడు. ఇక నెల్లూరు సింగర్ వాగ్దేవి కళ్ళ జోడు నుండి కాంటాక్ట్ లెన్స్ లోకి మారిపోయింది. ఆమె ‘ఆదిత్య 369’లోని సంగీత ప్రధాన గీతాన్ని అద్భుతంగా పాడేయడంతో ‘బొమ్మ బ్లాక్ బస్టర్ ఫెర్ఫామెన్స్’ అంటూ జడ్జీలు మెచ్చుకున్నారు. పాట పాడిన తర్వాత వాగ్దేవి ఇచ్చిన పొడుపుకధను కార్తీక్, తమన్ విప్పలేకపోయారు. అందులో నిత్యామీనన్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత పంజాబ్ కు చెందిన జస్కరన్ సీనియర్ ఎన్టీయార్ మూవీ ‘భలే తమ్ముడు’ లో మహ్మద్ రఫీ పాడిన ‘ఎంతవారు గానీ’ సాంగ్ పాడాడు. తెలుగు భాష నేర్చుకుని పాటలు పాడుతున్న జస్కరన్ ను అందరూ అభినందించారు. తమన్ ’30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా?’ అనే పుస్తకాన్ని అతనికి ప్రెజెంట్ చేశాడు. 20 రోజుల్లోనే తను తెలుగు నేర్చుకుంటానని జస్కరన్ చెప్పడం విశేషం. ఇక ఈ ఎపిసోడ్ లో చివరగా సింగర్ అదితీ భావరాజు ‘ధర్మక్షేత్రం’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ…’ పాట పాడి అలరించింది. ఆ పాటలో వచ్చే ‘పెదవి కొరికే… పెదవి కొరకే..’ అనే పదాల గురించి శ్రీరామ్ చంద్ర, తమన్ కాసేపు చర్చ చేశారు. అనంతరం ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కోసం డ్రసెస్ అండ్ జ్యూయలరీ సెలక్షన్ చేసుకోవడానికి కంటెస్టెంట్స్ చందనా బ్రదర్స్ కు వెళ్ళినప్పటి వీడియోను సరదాగా ప్లే చేశారు. మొత్తానికి బాలయ్య బాబు పాటలతో శుక్రవారం ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా సాగింది. ఇక ఫస్ట్ ఎలిమినేషన్ శనివారం జరుగబోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • telugu indian idol
  • Telugu Indian Idol Episode 11
  • Telugu Indian Idol New Episode
  • Telugu Indian Idol Ugadi Special

తాజావార్తలు

  • Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

  • Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions