Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Telugu Indian Idol Episode

Telugu Indian Idol : సమూహానికి…. సంగీతానికి వారథిగా

Published Date :February 26, 2022 , 7:18 pm
By Gogikar Sai Krishna
Telugu Indian Idol : సమూహానికి…. సంగీతానికి వారథిగా
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్, నటి, గాయని నిత్యామీనన్, పాపులర్ కార్తిక్ ఈ షోకు జడ్జెస్. క్షణం తీరిక లేకుండా స్టార్స్ మూవీస్ కు సంగీతం అందించే పనిలో తలమునకలై ఉండే… తమన్ లాంటి యంగ్ అండ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ షో కు టైమ్ ఇవ్వడం రియల్లీ గ్రేట్ థింగ్! అతని కారణంగా ఈ షోకు మరింత వెయిటేజ్ వచ్చింది.

మొదటి ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ గా స్టేజ్ మీదకు వచ్చింది అర్చకం మాన్య చంద్రిక. తిరుపతికి చెందిన మాన్య అక్కడ నుండి జడ్జెస్ కోసం తీర్థప్రసాదాలు తీసుకొచ్చింది. ‘దేవుడి ఆరాధన, సంగీత ఆలపన, తండ్రిని అనుసరించడం తనకు ఎంతో ఇష్టమ’ని చెప్పింది మాన్య. సంప్రదాయ దుస్తుల్లో స్టేజ్ మీదకు వచ్చిన మాన్య ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావ… ఊహూ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ పాడతాననే సరికీ అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న తాను అన్ని పాటలూ పాడగలనని నిరూపించుకోవడానికే ఈ సాంగ్ ఎంచుకున్నట్టు మాన్య తెలిపింది. అంతే హస్కీ వాయిస్ తో పాడింది కూడా! ఆమె పాటకు నిత్య, కార్తీక్ ఫిదా అయిపోయారు. అయితే తమన్ మాత్రం మరో పాట పాడమని కోరడంతో ‘పలుకే బంగారమాయేనా…’ అంటూ రామదాసు కృతిని ఆలపించి, అతని దగ్గర కూడా మార్కులు కొట్టేసింది మాన్య. ఆమెకు ‘యస్’ అనే కార్డ్ ఇచ్చారు జడ్జెస్.

Also Read

  • Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
  • Peddi : 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
Add as a preferred
source on google

సెకండ్ పార్టిసిపెంట్ సుదీప్ బేసికల్ గా కంపోజర్. అతను ‘కేరాఫ్‌ కంచరపాలెం’లోని ‘ఆశా పాశం…’ గీతాన్ని అద్భుతంగా పాడి గోల్డెన్ టిక్కెట్ అందుకున్నాడు. మూడో పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాద్ కు చెందిన వైష్ణవి. ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘కడలి’ సినిమాలోని ‘యాడికే…’ గీతాన్ని వైష్ణవి చక్కగా పాడింది. ఆమె గానామృతాన్ని ఆస్వాదించిన తమన్… ఎ. ఆర్. రెహమాన్ కు వైష్ణవిని రికమండ్ చేస్తానని మాట ఇచ్చాడు. న్యాయనిర్ణేతలు ఆమెకు గోల్డెన్ మైక్ ఇవ్వడం విశేషం. ‘చివరగా దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా దేవాలయం సమీపంలో ‘ఇంటి దోసె బండి’ని నిర్వహిస్తున్న శివకుమార్ తన ప్రతిభను చాటాడు. ‘రుద్రవీణ’ సినిమాలోని ‘తరలి రాద తనే వసంతం’ గీతాన్ని ఆలపించాడు. సింగర్ కావాలనే కోరికతో హైదరాబాద్ వచ్చి, ఎనిమిదేళ్ళుగా తల్లిని కూడా చూడకుండా ఇక్కడే ఉన్న శివకుమార్ పట్ల న్యాయనిర్ణేతలు బోలెడంత అభిమానం చూపించారు. అతనిలోని పట్టుదలను ప్రోత్సహిస్తూ ‘ఎస్’ కార్డ్ ఇచ్చారు. ఇలా నలుగురు సింగర్స్ అద్భుతంగా పాటలు పాడి మెప్పిస్తే… ఉమేష్ అనే కుర్రాడు నిత్యామీనన్ కోసం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ పాటను తనదైన స్టైల్ లో పాడి… వీక్షకులకు వినోదాన్ని పంచాడు.

‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమానికి శ్రీకారమైతే చుట్టారు కానీ… దీనికి సంబంధించిన ఇతర వివరాలు తెలుపకపోవడం పెద్ద లోటు. జడ్జెస్ ఇచ్చే డిఫరెంట్ టిక్కెట్స్ పార్టిసిపెంట్స్ కు ఎలా ఉపయోగపడతాయి? విజేతలకు లభించే ప్రైజ్ మనీ ఎంత? ఓవర్ ఆల్ కాన్సెప్ట్ ఏమిటీ అనేది మొదట్లోనే శ్రీరామచంద్రతో చెప్పించి ఉంటే బాగుండేది. పాటలు పాడిన తర్వాత వారిని ఎప్రిషియేట్ చేస్తూ, నేపథ్యంలో చప్పట్లు వినిపించాయి తప్పితే… జనాలు కనిపించలేదు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ప్రోగ్రామ్ ను డిజైన్ చేస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే.. ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సింగర్ కార్తిక్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అతను లైంగిక వేదింపులకు పాల్పడ్డాడంటూ, ‘మీ టూ’ సమయంలో కొందరు లేడీ సింగర్స్ ఆరోపణలు చేశారు. అప్పట్లో దానిని కార్తిక్ ఖండించాడు. కానీ అలాంటి వ్యక్తిని ఈ షోకు జడ్జిగా ఎలా పెడతారంటూ కొందరు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి సైతం ఆ విమర్శకులను సమర్థిస్తోంది. మరి దీనిపై కార్తిక్, నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Heroine Nitya Menon
  • Karthik
  • Music Director SS Thaman
  • Singer Sriram
  • telugu indian idol

తాజావార్తలు

  • Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions