NTV Telugu Site icon

Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన

Jani Master

Jani Master

Jani Master: కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూట్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు.

Also Read: Demonte Colony 2: భయపెట్టడానికి మీ ఇంటికే ‘డీమాంటే కాలనీ 2’.. జాగ్రత్త!

అతనిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి ఇవ్వడం జరిగిందని, దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు సిఫార్సు చేయడం జరిగిందనీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ చేస్తారని, భాదిత పక్షం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేసి FIR నమోదు చేసారని మాకు తెలిసిందని అన్నారు.

Also Read: Jani Master : పరారీలో జానీ మాస్టర్.. బాధిత మహిళ కూడా? ఏ క్షణమైనా అరెస్ట్??

భాదిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియా/ ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క బ్లర్ చేయని ఫొటోగ్రాఫ్ లను, వీడియోలను ఉపయోగించవద్దు అని కోరారు. ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని మీ అందరిని మరొకసారి అభ్యర్ధిస్తున్నాము అంటూ ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.

Show comments