Tollywood: సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది.. సంచలన లేఖ విడుదల చేసిన తెలుగు దర్శకుల సంఘం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ దర్శకుల సంఘం ఒక సంచలన లేఖ విడుదల చేసింది. వాస్తవానికి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ ఈ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. నిజానికి, కొద్ది రోజుల క్రితం ఒక వెబ్ పోర్టల్‌లో పనిచేసి, ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టుగా మారిన ఒక సీనియర్ జర్నలిస్టుని కొన్ని కారణాలతో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సదరు లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అదే వ్యక్తిని ఉద్దేశిస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌కి తెలుగు సినిమా దర్శకుల సంఘం ఒక లేఖ రాసింది. ఈ లేఖలో సదరు వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, కానీ వ్యక్తి కంటే సంస్థ ముఖ్యం గనుక మీ సంస్థ ప్రతిష్టను కాపాడడానికి మీరు తీసుకునే చర్యలకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
Also Read:Aamir Khan: ‘నేను సినిమాలు చూడను’.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
కానీ, సినిమా జర్నలిజంను స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే వ్యక్తిని మీరు గతంలో సస్పెండ్ చేసి, తిరిగి చేర్చుకోవడంతో ఆ వ్యక్తి చేసిన కక్ష సాధింపు చర్యల వల్ల మా సభ్యులు ఎంతో నష్టపోవడం జరిగింది. తెలుగు సినిమాల ప్రచారంలో ఎంతో కీలకంగా ఉండే మీ సంస్థ సభ్యత్వాన్ని ఇలాంటి వ్యక్తులకు ఇచ్చి, వారు దుర్వినియోగం చేయడం వల్ల తెలుగు సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది. కావున, మీరు సదరు వ్యక్తిపై సస్పెన్షన్ వంటి తాత్కాలిక చర్యలు కాకుండా, శాశ్వతంగా సభ్యత్వం తొలగించినట్లయితే జర్నలిజం విలువలను కాపాడిన వారవుతారు. అప్పుడే మీకు సహకరించడానికి మా అసోసియేషన్‌కి ఎలాంటి అభ్యంతరం ఉండదు అంటూ సంస్థ అధ్యక్షులు వి. ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి రామారావు, కోశాధికారి రాజేష్ మరియు మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరి పేరు మీద ఈ లేఖ విడుదల చేశారు. మరి దీనికి తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!