ZEE : 2024 సంవత్సరానికి జీ తెలుగు ఘనమైన వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చేస్తోంది. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం సినిమాతో 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం డిసెంబర్29 ఆదివారం సాయంత్రం 5:30గంటలకు జీతెలుగు లో మాత్రమే.
Also Read : Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’
Also Read
తల్లికి ఇచ్చిన మాట కోసం సూర్య (నాని)తన కోపాన్ని వారంలో ఆరురోజులు అదుపులో ఉంచుకొని శనివారం మాత్రం తనకు అన్యాయం చేసిన వారిపై పగ తీర్చుకుంటాడు. సోకులపాలెంలో జరిగిన ఒక విషాదఘటన సిఐ దయా (ఎస్.జె.సూర్యపాత్ర)ని సూర్యకి పరిచయం చేస్తుంది. దయాని ఎదుర్కొనేందుకు సూర్యకి పోలీస్ కానిస్టేబుల్ చారులత (ప్రియాంకమోహన్) సహాయపడుతుంది. అసలు దయాపై సూర్య కోపానికి కారణమేంటి. రాజకీయనాయకుడు కూర్మానందం (మురళీశర్మ) ఎలా సమస్యల్లో పడతాడు. అసలు చారులత ఎవరు. అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే సస్పెన్స్ యాక్షన్ డ్రామా సరిపోదా శనివారం సినిమా చూడాల్సిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో నాని, ప్రియాంక మోహన్ హీరోయిన్లుగా నటించగా ఎస్.జె.సూర్య, మురళీశర్మ, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, శివాజీరాజా, అభిరామి, అదితిబాలన్, అజయ్ఘోష్, విష్ణుఓయ్, హర్షవర్ధన్, అజయ్ త్రదిరులు ముఖ్యపాత్రలు పోషించారు. సరిపోదాశనివారం సినిమాతో జీ తెలుగుతో కలిసి ఈ ఏడాదిని మీరూ ఘనంగా ముగించేయండి. జీ తెలుగు అందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ ఏడాది చివరి ఆదివారం డిసెంబర్ 29న సాయంత్రం 5:30 గంటలకు, తప్పక చూడండి!
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!