Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుదలపై అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో, తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవో జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీలకు అదనంగా డాల్బీ 7.1, 2K, 4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
అలాగే ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్-ప్రీమియం ఏర్పాటు చేయాల్సిందేనని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా రోజుకు నాలుగు షోలకు మాత్రమే రోజువారీ అనుమతి ఉండేది; అనుమతి తీసుకున్న సినిమాలకు మాత్రమే అదనంగా షో వేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
అయితే ఇందులో ఒక మెలిక కూడా పెట్టారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని చిన్న సినిమాల నిర్మాతలు గగ్గోలు పెడుతున్న క్రమంలో, పెంచిన ఒక షోను తప్పనిసరిగా చిన్న సినిమాలకు కేటాయించాలని పేర్కొన్నారు.
అదేవిధంగా ₹100 కోట్ల బడ్జెట్ పైబడిన సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్’ హోదా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి పొందిన సినిమాల నిర్మాతలు, నిబంధనల ప్రకారం పెంచి అమ్మిన లాభాల్లో 20% ఫిల్మ్ ఫెడరేషన్ సహా తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్‌కు జమ చేయాలంటూ ఒక నోటీసు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!