Site icon NTV Telugu

Betting App Case : బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

Betting App

Betting App

బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులన్నిటిని ఇక నుండి సీఐడీ విచారించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేసారు. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అయ్యాయి. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేసారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు కూడా నమోదు చేసారు పోలీసులు. కొందరు సినీనటులను పిలిచి విచారించారు పోలీసులు.

Also Read : Mohan Lal : L2 ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైమ్ రికార్డ్

ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో సెలెబ్రిటీలను విచారిస్తున్నారు పోలీసులు. బుల్లితెర నటీమణులు రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియా, యాంకర్ శ్యామల పొలుసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. అలాగే మియాపూర్ పోలీసులు ఎవరెవరు ఏ ఏ యాప్స్ కు ప్రచారం చేసారని విషయాలను కనుగొన్నారు పోలీసులు. పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. జంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్. ఏ 23 యాప్ కోసం విజయ్ దేవరకొండ, యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కు హీరోయిన్ ప్రణీత .జీట్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్  ఆంధ్ర 365 ఆప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్థించారు. ఇప్పుడు సీఐడీకి బదిలీఅయిన ఈ కేసులో రానున్న రోజులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Exit mobile version