NTV Telugu Site icon

Chiranjeevi : చిరంజీవిని సత్కరించనున్న తెలంగాణ సీఎం

Chiranjeevi Sanmanam

Chiranjeevi Sanmanam

Telangana government will felicitate Mega Star Chiranjeevi for the honor of Padma Vibhushan: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు పెద్దగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయనతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకయ్య నాయుడుకు సైతం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలువురు సినీ-రాజకీయ రంగాలకు చెందిన వారు ఇరువురిని కలిసి వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేసి సత్కరించి తమ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు.

Bramayugam: బ్లాక్ అండ్ వైట్ లోనే మమ్ముట్టి భ్రమ యుగం..

ఇక ఇప్పుడు వీరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించడానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పద్మ అవార్డులు అందుకోబోతున్న అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. పద్మ విభూషణ్ గ్రహీతలు వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులను అందుకోబోతున్న మరో ఆరుగురు పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరందరినీ స్వయంగా సత్కరించబోతున్నారు. ఇక ఏటా గణతంత్ర దినోత్సవం నాడు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తారు. కళ, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, వైద్యం, ప్రజాసేవ, విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందిస్తారు.