Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఎస్డిసి నూతన ఛైర్మన్ గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇతర సబ్యులకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతో సానుకూలమైన అడుగని పేర్కొంది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై బాలయ్య వ్యక్తం చేసిన ఆవేదన అలాగే సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను బాలకృష్ణ చాలా స్పష్టంగా ప్రస్తావించారని అనేక థియేటర్లు మనుగడ కోసం పోరాడుతూ మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. “తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ప్రత్యేక సౌకర్యాలు కోరడం లేదు. థియేటర్లను కాపాడేలా, తెలుగు సినీ పరిశ్రమను బలోపేతం చేసేలా న్యాయమైన, పారదర్శకమైన, స్థిరమైన వ్యవస్థ కావాలని మాత్రమే కోరుతున్నారు” అని ఫిల్మ్ చాంబర్ పేర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను బహిరంగంగా ప్రస్తావించి, ఎగ్జిబిటర్లకు మద్దతుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ కృతజ్ఞతలు తెలిపాయి.
Also Read
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?