Mirai : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తేజసజ్జా ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేశారు. అప్పటి నుంచే చిరంజీవితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో తనకున్న అనుబంధం పంచుకున్నాడు. చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు నన్ను తన ఇంట్లో పిల్లాడిగా చూసుకునేవారు. అందుకే ఆయనంటే నాకు అంత అభిమానం, ప్రేమ. ఆయన సినిమాల్లో నేను నటించినప్పుడు.. అంత బిజీగా ఉన్నా సరే.. నేను తిన్నానా లేదా.. నా హెల్త్ బానే ఉందా షూటింగ్ చేయొచ్చా అనేది తెలుసుకునేవారు అంటూ తెలిపాడు తేజ.
Read Also : Pawan Kalyan – Ram Charan – Bunny : ఒకే ఫ్రేమ్ లో పవన్, చరణ్, బన్నీ.. ఫ్యాన్స్ కు పండగే..
అప్పటికీ, ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఆయన ఆశీర్వాదం వల్లే ఇలా ఉన్నాను. అందుకే నేను అమ్మ, నాన్న, చిరంజీవి అంటుంటాను. నా హనుమాన్ సినిమా వచ్చాక.. ఆయన స్పెషల్ గా ఫోన్ చేసి 25 నిముషాలు మాట్లాడారు. తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి.. ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఎలా జాగ్రత్తగా కెరీర్ లో ముందుకెళ్లాలి అనేవి ఆయన చెప్పారు. నిజంగా అంత బిజీగా ఉండి నాకు ఫోన్ చేస్తారని అనుకోలేదు. పైగా అన్ని జాగ్రత్తలు చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. అది నా జీవితంలో మర్చిపోలేను. ఆయన చెప్పిన జాగ్రత్తలు ఇప్పటికీ పాటిస్తూనే ఉంటాను అని తెలిపాడు తేజ. ఇక మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న రాబోతోంది. ఈ సందర్భంగా తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో మనోజ్ విలన్ పాత్ర చేసిన విషయం తెలిసిందే.
Read Also : Pawan Kalyan : అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్, అకీరా..!
