Teja Sajja: హను-మాన్ తరువాత తేజ సజ్జా సినిమా ఇదే.. రేపే అధికారిక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teja Sajja karthik Ghattamaneni Project to be Announced tomorrow: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ… ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చూడాలని ఉంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యంగ్ ఏజ్ లో కనిపించి షాకిచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో తేజ సజ్జా హీరోగా పరిచయం అయ్యారు. ఇష్క్, అద్భుతం వంటి సినిమాలు చేసి పర్వాలేదనిపించుకున్నారు. ఇక ఈ ఏడాది తనకు మొదటి సినిమా హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి హనుమాన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు తేజ సజ్జా. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు రూ.350 కోట్లు కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ నిలిచింది.
Chiranjeevi: తేజ సజ్జ చేశాడు.. ఇక నేను చేయనక్కర్లేదు..చిరు ఆసక్తికర వ్యాఖ్య లు
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక ఈ సినిమా తర్వాత తేజ సజ్జా నెక్ట్స్ ప్రాజెక్ట్ అంతా జై హనుమాన్ అనుకున్నారు. కానీ ఆ సినిమాలో తేజ క్యారెక్టర్ జస్ట్ కొద్దిసేపు ఉంటుందని దర్శకుడు ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక తేజ సజ్జా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తేజ తన తరువాతి సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని కార్తీక్ ఘట్టమనేని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు తేజ సజ్జా కార్తీక్ ఘట్టమనేని సినిమా అధికారిక ప్రకటన రేపు రాబోతుందట. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి అధికారిక ప్రకటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..