Site icon NTV Telugu

Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్

Chiru

Chiru

Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్న మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయనకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చిరంజీవి గారు చేసిన పని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నటించిన ఇంద్ర సినిమా కోసం ఓ చైల్డ్ ఆర్టిస్టు కావాలని వెతుకుతున్నారు. అది కొంచెం పవర్ ఫుల్ గానే ఉంటుంది. చిరంజీవి గారి ముందు అశ్వినీ దత్ గారు వంద మంది చైల్డ్ ఆర్టిస్టుల ఫొటోలు పెట్టారు. కానీ చిరంజీవి నా ఫొటో తీసి ఇతను నాకు కావాలని అన్నాడంట.

Read Also : Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్

వెంటనే అశ్వినీ దత్ మా ఇంటికి వచ్చి మా నాన్నను ఒప్పించే పనిలో పడ్డారు. చిరంజీవి సినిమా అంటే మా నాన్న వెంటనే ఒప్పేసుకుంటారని అనుకున్నారు. కానీ ఆయనకు అస్సలు ఇష్టం లేదు. కానీ చాలా కష్టపడి ఒప్పించారు అశ్వినీ దత్. అలా చిరంజీవి గారి సినిమా ఇంద్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీతో నా జీవితమే మారిపోయింది. ఆ తర్వాత వరుసగా చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు వచ్చాయి. అక్కడి నుంచి నేను వెను తిరిగి చూసుకోలేదు. ఆ రోజు చిరంజీవి గారు నా ఫొటో తీయకపోతే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదేమో. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో నటించే అవకాశాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో చేసే అవకాశాలు వచ్చాయని ఎమోషనల్ అయ్యాడు తేజ. ఇక మిరాయ్ సినిమా విషయంలో తాను చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నానని.. కచ్చితంగా హిట్ అవుతుందని తెలిపాడు తేజ.

Read Also : Pawan Kalyan : అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్‌, అకీరా..!

Exit mobile version