NTV Telugu Site icon

వరుణ్ తేజ్ విడుదల చేసిన ‘తీస్ మార్ ఖాన్’ సాంగ్

tees maar khan

tees maar khan

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసి చాలా బాగుందని ‘తీస్ మార్ ఖాన్’ యూనిట్‌ని అభినందించిన ఆయన, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ పాట గురించి నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ” ‘పాప ఆగవే’ అంటూ మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ ‘వదలనే వదలనే నిన్నే నేను వదలనే’ అంటూ చెప్పిన లైన్‌కి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాయగా, కారుణ్య ఆలపించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతంతో పాటు హీరోహీరోయిన్స్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ లతో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి” అని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్‌ జి గోగణ దర్శకత్వం వహించారు.

Papa Agave Lyrical Song | Tees Maar Khan Songs | Aadi, PaayalRajput | Kalyanji Gogana | Sai Kartheek