NTV Telugu Site icon

Adipurush: హనుమంతుడి కోసం ఒక సీటు.. వావ్.. ఏం నమ్మకం ఇచ్చారయ్యా

Adipurush

Adipurush

Adipurush: ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది అని తెలుసు కానీ.. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఊహించలేదు అని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా కృతి సనన్ సీతగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశాయి. జూన్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందా.. ? ఎప్పుడెప్పుడు థియేటర్ లకు వెళ్దామా..? అని డార్లింగ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ను ఒకప్పుడు తిట్టుకున్నవారే.. ఇప్పుడు చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ చేస్తున్న ప్లాన్స్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. తిరుపతిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహిస్తున్నారు. మొట్ట మొదటి సారి అయోధ్య సెట్ వేస్తున్నారు.. ప్రభాస్ 50 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేస్తున్నారు. వందమంది సింగర్లు.. వందమంది డ్యాన్సర్లు.. ఆదిపురుష్ మరియు రామాయణం సాంగ్స్ ను పాడనున్నారు. ఇక అయోధ్య సెట్ లో శ్రీరాముని విగ్రహాలతో పాటు వెంకటేశ్వర స్వామి, విష్ణు మూర్తి కథలను తెలిపేలా స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇవన్నీ దగ్గరుండి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చూసుకోవడం విశేషం. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అభిమానులకు మరో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చారు మేకర్స్.. హనుమంతుడు అంటే మనకు ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని చేయడానికి అయినా.. దైర్యం లేకపోయినా.. భయమైనా.. ఆంజనేయ శ్లోకమే చదువుతాం. ఇక ఆ నమ్మకంతోనే ఆదిపురుష్ థియేటర్ లో ఒక సీట్ ను హనుమంతునికి కేటాయించాలని మేకర్స్ వెల్లడించారు.

Larissa Bonessi: సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్.. విప్పి చూపించడంలో ఎక్స్ పర్ట్
” రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన “ఆదిపురుష్”ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. హనుమంతుని నమ్మకం ఎప్పుడు మనతోనే ఉంటాడు అన్న మాటతో అభిమానుల గుండెలను భక్తిభావంతో నింపేశారు మేకర్స్. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు.. ఏం నమ్మకం ఇచ్చారయ్యా అంటూ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

Show comments