Tarun Bhaskar: విజయ్ వైల్డ్ కార్డు.. నాలుగు ప్లాపులు వస్తేకానీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెళ్లి చూపులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. రియలిస్టిక్ క్యారెక్టర్స్, నో ఫిల్టర్స్ ఎటువంటి హంగామా లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విజయ్ దేవరకొండ లాంటి నాయుడును ఇండస్ట్రీకి అందించింది. ఇక ఈ సినిమా తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ కుర్రకారు ఒరిజినల్ ఫ్రెండ్ షిప్ ను చూపించి యూత్ ఐకానిక్ సినిమాగా మార్చేశాడు. ఇక ఆ తరువాత తాను కూడా నటుడిగా మారి పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్న తరుణ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా తెరకెక్కించనున్నాడు. ఇకపోతే తాజాగా ఈ డైరెక్టర్ ఒక టీవీ షో లో పాల్గొని తన హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
మళ్లీ విజయ్ తో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకు.. “విజయ్ వైల్డ్ కార్డు ఎంట్రీ లాంటి వాడు.. ఒక నాలుగు ప్లాపులు వచ్చాక అతడితో సినిమా చేస్తా.. ప్లాపులు విజయ్ కా.. నీకా అనగానే .. నాకే నాకే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలాగే ‘పెళ్లి చూపులు’ షూటింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను గుర్తుచేసుకున్నాడు. “ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్ దేవరకొండ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. దర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్ ఉన్నవని అడిగితే.. ఫస్ట్ స్టార్టింగ్‌ల భయం వేసిందిరా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని చెప్పాడు.. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తరుణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!