Nandamuri Tarakaratna: అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర జరిగింది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం మహా ప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి ఆయన తండ్రి మోహన్ కృష్ణ తలకొరివి పెట్టారు. తారకరత్నకు ఒక కుమారుడు.. అతని వయస్సు మూడేళ్లు. కుమారుడు చిన్నవాడు కావడంతో తారకరత్న అంత్యక్రియలు ఆయన తండ్రినే నిర్వహించారు. నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 25 రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు తారకరత్న. అలా హాస్పిటల్ లోపలి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.
Taraka Ratna: ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను-తరుణ్
Also Read
తారకరత్న కోలుకొని బయటికి రావాలని అభిమానులు దేవుడ్ని ప్రార్దించిన విషయం తెల్సిందే. అయినా దేవుడు వారి ప్రార్థనలను వినలేదు.. అతి చిన్న వయస్సులోనే తారకరత్నను మృత్యువు కబళించింది. ఇక తారకరత్నకు గుండెపోటు వచ్చిన దగ్గరనుంచి.. అంత్యక్రియలు నిర్వహించేవరకు అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు బాలకృష్ణ. తన అన్న మోహన్ కృష్ణ పక్కనే ఉండి.. తారకరత్నకు అంత్యక్రియలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..