NTV Telugu Site icon

Tarakaratna: తారకరత్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..?

Tarakaratna

Tarakaratna

Tarakaratna: నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఆయనకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన స్థితి నుంచి తారకరత్న బయటపడినట్లు వైద్యులు తెలుపుతూనే వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, తారకరత్న చెవిలో చదివిన మృత్యుంజయ మంత్రం పనిచేసిందని, అంతకు ముందు చికిత్సకు శరీరం స్పందించలేదని, కానీ, మృత్యుంజయ మంత్రం చదివాకా ఆయనలో మార్పు వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

Nayanthara: భర్తను అవమానిస్తే నయన్ ఊరుకుంటుందా.. అందుకే ఆ పని..?

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. మొదటి కుప్పంలో చికిత్స మొదలుపెట్టగా.. మెరుగైన వైద్యం కోసం బాలకృష్ణ కుటుంబం.. తారకరత్నను బెంగుళూరు తరలించారు. అక్కడ కనుక శరీరం చికిత్సకు స్పందించకపోతే విదేశాలకు తరలించడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంతలోనే అభిమానుల ప్రార్థనల వలన తారకరత్న చికిత్స కు స్పందించడంతో విదేశాలకు తీసుకువెళ్లే ఆలోచనను మానుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని నందమూరి సన్నహిత వర్గాలు చెప్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, తారకరత్నను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఎటువంటి విషయమైన వైద్యులు, బాలకృష్ణకే తెలుపుతున్నారని, ఎంత ఖర్చు అయినా, ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా బాలయ్యనే మొదట నిలబడి అన్న కొడుకును చూసుకుంటున్నాడు. ఇక తారకరత్న త్వరగా కోలుకొని బయటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.