Tammareddy Bharadwaja comments on chiranjeevi Movies: ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్లు మాస్ ఓరియెంటెడ్ పాత్రలకు దూరంగా ఉండాలని సీనియర్ నిర్మాత-దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. భోళాశంకర్, లూసిఫర్ వంటి రీమేక్ చిత్రాలతో చిరంజీవి నిరుత్సాహపడడం కంటే నేచురల్ సినిమాలు చేయడం మంచిది అని చిరంజీవి తన వయసుకు తగిన పాత్రలు చేయాలని అన్నారు. ఈ అభిప్రాయాన్ని చిరంజీవితో చెప్పాలని భావించానని, కానీ సాధ్యం కాలేదన్న ఆయన ధైర్యం చాలకనో లేక తమ చర్చ మరో అంశంపైకి మళ్లడం వల్లనో చెప్పలేకపోయానని చెప్పుకొచ్చారు. తమ్మారెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయాలను పంచుకుంటూ సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని ఒకప్పుడు చిరంజీవి అందరి కుటుంబంలో వ్యక్తిగా కనిపించేవారని, ఆ చిరంజీవి కనిపిస్తే మళ్లీ ఆ సినిమాలు ఆడతాయని అన్నారు.
Manmadhudu: ‘మన్మథుడు’ మళ్ళీ వచ్చేస్తున్నాడు..
దంగల్ వంటి నేచురల్ ఫిల్మ్‌లో చిరంజీవి నటించినా ప్రేక్షకులు చూస్తారన్న ఆయన అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన లేకుండేదని, ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్నవాళ్లు ఉన్నప్పటికీ, చాలామంది వ్యాపారంగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఒకప్పుడు రచయితలు సూటిగా కథలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం ఓపెన్ చేస్తే, టాప్ యాంగిల్ షాట్ అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారన్న ఆయన ఇందుకు దర్శకులే రచయితలు కావడమూ కారణమని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు ఉపయోగపడే ఏదో ఒక అంశం సినిమా కథలో ఉండాలని, అదీ సహజంగా ఉండాలని పేర్కొన్న ఆయన దానిని పక్కన పెట్టి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని అంటే సినిమాలు ఆడటం లేదని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలంతా కెరీర్ ప్రారంభంలో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుందని పేర్కొన్న ఆయన చిరంజీవి నటించిన ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘విజేత’లాంటి సినిమాలకు అందుకే మంచి ప్రేక్షకాదరణ దక్కిందని అన్నారు.