NTV Telugu Site icon

Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది

Prabhas

Prabhas

Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి అందరికి తెల్సిందే. టాలీవుడ్ సినిమాల గురించి, నిర్మాతల గురించి ఆయన నిత్యం తాన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. సినిమా పప్లాప్ అయినా, హిట్ అయినా దానికి తగ్గ రీజన్స్ చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు హీరోల పై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే తమ్మారెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ కె గురించి మాట్లాడి షాక్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె.. పాన్ ఇండియా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అన్ని అనుకున్నట్లు జరిగితే.. మొదటి రోజే ఈ సినిమా 500, 600 కోట్లు రాబడుతుందని చెప్పుకొచ్చారు.

SS Rajamouli: హీరోలను తలదన్నే లుక్లో జక్కన్న.. ఫ‌స్ట్ యాడ్ కు అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?

” ప్రాజెక్ట్ కె.. నాగ అశ్విన్ చేస్తున్న సినిమా.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ మధ్యనే కమల్ హాసన్ కూడా ఎన్టీఆర్ అయ్యారు. ఈ సినిమా కనుక ప్రోపర్ గా వాళ్లు ప్రోజెక్ట్ చేయగలిగితే ప్రపంచంలోని టాప్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే .. ఆ సినిమాను నాగి తీర్చిదిద్దే విధానం.. నేను సెట్ కు వెళ్లి చూసి ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను.. వాళ్లు కనుక ప్రోపర్ గా సినిమాను రిలీజ్ చేస్తే గ్లోబల్ సినిమా అవుతుంది. గ్లోబల్ గా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఒకవేళ ఇది కనుక తప్పితే.. రాజమౌళి- మహేష్ బాబు సినిమా కచ్చితంగా గ్లోబల్ గా వెళ్తోంది. ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టడం ఈజీగా రాబడుతుంది.. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. వచ్చే ఏడాది వస్తుంది. నాకు తెలిసి టాప్ గ్రాస్ అందుకొనే సినిమాల్లో ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి.. ఓపెనింగ్ రోజునే 500, 600 కోట్లు రావొచ్చు. అలాగే చేస్తున్నారు అనుకుంటున్నాను. అంటే ఏదైనా కథ బావుంటేనే ఇదంతా జరుగుతుంది అని చెప్పొచ్చు. మొన్న ఆదిపురుష్ ఓపెనింగ్ రూ. 140 కోట్లు రాబట్టింది. ప్రభాస్ సినిమా ఓపెనింగ్ అంటే అంత ఉంటుంది. తెలుగువాడు ప్రపంచమంతా కాలర్ ఎత్తుకొని తిరిగే ఛాన్స్ వస్తుందని, రావాలని.. కోరుకుంటున్నాను” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.