NTV Telugu Site icon

Tammareddy Bharadwaj: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేలా.. మాస్టారూ

Tammareddy

Tammareddy

Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయంటే.. తెలుగు వారు అయ్యి ఉండి ఇంకో తెలుగోడు పైకి ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నావా.. ? అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అభిమానులే కాకుండా ప్రముఖులు సైతం తమ్మారెడ్డిపై ధ్వజమెత్తుతున్నారు. నాగబాబు ఘాటుగా స్పందిస్తే దర్శకుడు రాఘవేంద్ర రావు కొంచెం సున్నితంగా చెప్పినా గట్టిగానే చెప్పారు. ఇక ఈ వివాదంపై ఎట్టకేలకు తమ్మారెడ్డి స్పందించాడు. తాను ఎవర్నీ కించపరచాలన్న ఉద్దేశంతో అలా అనలేదని చెప్పుకొచ్చాడు.

Naresh: నాకు ప్రైవసీ కావాలి.. పెళ్లిపై స్పందించిన నరేష్

“ఎవర్నీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. సినిమాలు రెండు రకాలు అని చెప్పాను. రిలీజ్ అయ్యి పేరు తెచ్చే సినిమాలు ఒకటి.. రిలీజ్ పేరు కోసం వచ్చే సినిమాలు.. థియేటర్ కు వచ్చే సినిమాలు. అంటే ఒకటి అవార్డు సినిమాలు..రెండోది రివార్డు సినిమాలు. కొన్ని సినిమాలు ఫెస్టివెల్ కు మాత్రమే ఉంటాయి. అలా వాటికోసం తీసే సినిమాలకు కూడా అచల ప్రాసెస్ ఉంటుంది. చాలా సినిమాలు నంది అవార్డులకు పెడతాం.. నేషనల్ అవార్డుకు పెడతాం. ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు. నేర్చుకోవాలి అన్ని చెప్పే క్రమంలో రేపు ఆర్ఆర్ఆర్ కు వస్తే మనకు కూడా రాదా అని అంటారు. ఎందుకంటే ఛాంబర్ కు వెళ్తే.. మా సినిమాకు థియేటర్ లు ఎందుకు ఇవ్వడం లేదు.. ఆ సినిమాలకు ఇచ్చారుగా అని అడుగుతున్నారు. ఇలాంటి వన్నీ నేను చూసాను కాబట్టి ఇప్పటితరం వారికి వాటి గురించి చెప్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టారని చెప్పా.. రూ.80 కోట్లుంటే నేను 10 సినిమాలు తీస్తా అని చెప్పా. ఎందుకంటే అవార్డుల కోసం మనం సినిమాలు తీయడం లేదు కాబట్టి.. అంతంత డబ్బు పెట్టి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పాను. రెండున్నర గంటలు నేను మాట్లాడిన దానికి మొత్తం వినకుండా ఒక నిమిషం ఉన్న చిన్న క్లిప్ ను పట్టుకొని ఎవరెవరో మాట్లాడుతున్నారు.మొత్తం వినకుండా చిన్న ముక్క పట్టుకొని నాపై అబాండాలు వేస్తున్నారు. అలా మాట్లాడితే అది వాళ్ల మూర్ఖత్వం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో సెటైర్లు వేస్తున్నారు. మంచిగా కవర్ చేసావ్ అని కొందరు అంటుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేలా.. మాస్టారూ అంటూ చెప్పుకొస్తున్నారు.