Tammareddy Bharadwaj: అందరివాడు.. తమ్మారెడ్డి భరద్వాజ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరికి సినిమా అయస్కాంతం లాంటిది. వారిలోని ప్రతిభ అనే ఇనుప రజను ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, ఇక్కడికే ఆకర్షిస్తూ ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి చిత్రసీమలో అభిరుచిగల నిర్మాతగా సాగారు. భరద్వాజ అన్న లెనిన్ బాబు కూడా దర్శకునిగా అలరించారు. కానీ, భరద్వాజ ఎంచక్కా ఇంజనీరింగ్ చదివి, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఇంజనీర్ గా సాగాలనుకున్నారు. కానీ, ఆయన ప్రతిభను సినిమా రంగమే ఆకర్షించింది. దర్శక నిర్మాతగా, నటునిగా సాగారు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా కార్మికుల పక్షపాతిగా నిలచి వారికి చేదోడువాదోడుగా ఉంటూ ఈ నాటికీ అందరి చేత అందరివాడు అనిపించుకుంటున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ 1948 జూన్ 30న జన్మించారు. భరద్వాజ పసివాడుగా ఉన్నప్పటికే ఆయన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి సారథి స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలపై హైదరాబాద్ కు వచ్చేశారు. చిన్నతనం నుంచీ సినిమా వాతావరణం చూస్తూ పెరిగారు భరద్వాజ. సికిందరాబాద్ వెస్లీ హై స్కూల్ లో చదివిన భరద్వాజ, తరువాత ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివారు. కొన్నాళ్ళు హైదరాబాద్ కార్పోరేషన్ లో పనిచేశారు. ఆ పై నీటిపారుదల శాఖలో కొంతకాలం ఇంజనీర్ గా ఉన్నారు. సొంతగా సినిమా తీయాలన్న ఉద్దేశంతో చిత్రసీమలో అడుగు పెట్టి 1979లో తొలి ప్రయత్నంగా చిరంజీవితో ‘కోతలరాయుడు’ చిత్రం నిర్మించారు. వర్ధమాన నటునిగా సాగుతున్న చిరంజీవికి ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత కూడా భరద్వాజ నిర్మించిన ‘మొగుడు కావాలి’లో చిరంజీవి హీరోగా నటించారు. అది కూడా జనాన్ని ఆకట్టుకుంది. భరద్వాజ తాను నిర్మించిన ‘ఇద్దరు కిలాడీలు’ ద్వారానే సుమన్ ను పరిచయం చేశారు. ‘మన్మథ సామ్రాజ్యం’తో దర్శకుడయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అలజడి’ మంచి విజయం సాధించింది. దర్శకునిగా భరద్వాజకూ మంచి పేరు లభించింది.
Also Read
- Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. 'ఉప్పెన' క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
- Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
- PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్‌లో 'పెద్ది' దిగుతున్నాడు!
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
భరద్వాజ దర్శకత్వంలో “నేటి దౌర్జన్యం, కడప రెడ్డమ్మ, పచ్చని కాపురం, నాగజ్యోతి, పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, బంగారు మొగుడు, అత్తా..నీ కొడుకు జాగ్రత్త, స్వర్ణముఖి, రామ్మా చిలకమ్మా, ఎంత బాగుందో” వంటి చిత్రాలు రూపొందాయి. తరువాత స్వీయ దర్శకత్వంలో “ఊర్మిళ, వేటగాడు, స్వర్ణక్క, సంచలనం, ప్రతిఘటన” వంటి చిత్రాలు నిర్మించారు. ఇతరుల దర్శకత్వంలో “వన్ బై టూ, దొంగ రాస్కెల్, సింహగర్జన, సూరి, నేను పెళ్ళికి రెడీ” వంటి సినిమాలు తెరకెక్కించారు.
వి.కె.నరేశ్ హీరోగా రూపొందిన ‘నేనేరా పోలీస్’లో విలన్ గా నటించి మెప్పించారు భరద్వాజ. ‘ఈ రోజుల్లో’ సినిమాలోనూ కాసేపు తెరపై తళుక్కుమన్నారాయన. కొన్ని టీవీ సీరియల్స్ కూడా భరద్వాజ రూపొందించారు. సొంత యూ ట్యూబ్ ఛానెల్ లో తరచూ చిత్రసీమలోని పలు అంశాలపై తన అభిప్రాయాలు వినిపిస్తూ సాగుతున్నారాయన. ఆయన కామెంట్స్ కొన్నిసార్లు వివాదాలకు దారితీసినా, సినీజనం మాత్రం భరద్వాజను తమ వాడిగానే అభిమానిస్తూ ఉంటారు. భరద్వాజ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్‌లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!