NTV Telugu Site icon

Leo: ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్

Leo Telugu Rights

Leo Telugu Rights

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా గ్రాండ్‌గా ఆడియో,ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుక కోసం దళపతి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కానీ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ… లియో ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సెవ‌న్ స్క్రీన్‌ స్టూడియో ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

ఈవెంట్ పాసుల కోసం ఊహించిన దానికంటే ఎక్కువగా రిక్వెస్ట్స్ రావడం, ఆల్రెడీ బ్లాక్ లో ఈవెంట్ పాస్ లని ప్రింట్ చేసి బ్లాక్ మార్కెట్ వర్గాలు అమ్ముకోవడం, భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేస్తున్నామని వివరణ ఇచ్చారు కానీ కోలీవుడ్ వర్గాల్లో మాత్రం మరోలా ప్రచారం జరుగుతోంది. రాజ‌కీయప‌ర‌మైన ఒత్తిడుల వ‌ల్లే ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అలాంటి వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. అయినా కూడా దీని వెనక కోలీవుడ్ హీరో, డీఎంకే మినిస్ట‌ర్ ఉద‌య‌నిధి స్టాలిన్‌ హ్యాండ్ ఉందని అంటున్నారు. ఆయనకు సంబంధించిన రెడ్ జెయింట్స్ సంస్థకు లియో రైట్స్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు.

Show comments