Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anbe Diana OTT Release: రొమాంటిక్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన తమిళ రొమాంటిక్ కామెడీ ‘అన్బే డయానా’ ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రేమ, కుటుంబ బంధాలు, భిన్నమైన సంస్కృతుల మధ్య జరిగే ఈ కథ పక్కా కామెడీ ట్రాక్ లో నడుస్తుంది. 2026 జూన్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, కుటుంబ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.
ఆగస్టు 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
పరి ఎలావళగన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్బే డయానా’ 2026 ఆగస్టు 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. చిత్ర బృందమే ఈ విషయాన్ని ఆఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అన్బే డయానా’ (Anbe Diana) సినిమా మొత్తం 5 భాషల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీ మాతృభాష అయిన తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మరియు మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.
Also Read
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
‘అన్బే డయానా’లో పరి ఎలావళగన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటి రోజా సెల్వమణి కూడా కీలక పాత్రలో కనిపించారు. హీరో తల్లి సరళ పాత్రలో రోజా నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతన్, పరితాబంగల్ గోపి, సెల్ మురుగన్, నిఖిలా శంకర్, ఇస్మత్ బాను, సుదర్శన్ గాంధీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాజిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సత్య కరికాలన్, ఎరా శరవణన్, యువరాజ్ గణేసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అసలు కథ ఏంటి?
చెన్నైలోని పెరంబూరు ప్రాంతంలో నివసించే ఒక హిందూ సంప్రదాయ కుటుంబానికి చెందిన అథ్లెటిక్స్ కోచ్ చిరుమామిళ్ల సీతాకృష్ణ (CSK), అదే ఊరిలో ఉండే మోడర్న్ క్రిస్టియన్ ఐటీ ప్రొఫెషనల్ మ్యాజిక్ డయానా డిసౌజాతో ప్రేమలో పడతాడు. మొదట్లో డయానా అతడిని నిరాకరించినప్పటికీ, ఒక ఊహించని సంఘటన వల్ల వారిద్దరూ దగ్గరవుతారు.
కృష్ణకు డయానాపై ప్రేమ ఉన్నప్పటికీ, అతని కుటుంబ పరిస్థితులు ఆ ప్రేమకు అడ్డంకిగా మారతాయి. ముఖ్యంగా కృష్ణ తల్లి సరళ తన కొడుకు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. దీంతో తల్లిని ఎదిరించలేని కృష్ణ కుటుంబం చూసిన అమ్మాయితో నిశ్చితార్థానికి అంగీకరిస్తాడు. అయితే ఆ తర్వాత తన నిర్ణయం తప్పని తెలుసుకుంటాడు.
డయానాతోనే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న కృష్ణ, తన స్నేహితుడి సహాయంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి కుటుంబ గొడవలు, అపార్థాలు, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కథలో వినోదాన్ని పంచుతాయి. చివరికి ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం.
ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాలు, కామెడీని జోడించిన ‘అన్బే డయానా’ థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 28 నుంచి ఈ రొమాంటిక్ కామెడీని SonyLIVలో చూసి ఎంచక్కా నవ్వుకోవచ్చు.
- Tags
- Anbe Diana
- cinema
తాజావార్తలు
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!