ఈ పొంగల్ మామూలుగా ఉండదు దళపతి విజయ్ ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇస్తాడని సంబరపడిపోతున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ జారీ లోపం.. లీగల్ బ్యాటిల్‌తో సతమతమౌతుండటంతో జనవరి 9కి రావాల్సిన మూవీ వాయిదా పడింది. అటు జనవరి 10న వచ్చిన పరాశక్తి అండర్ ఫెర్ఫామెన్స్ చేయడంతో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యామా అని ఫీలవుతున్న తమిళ ఆడియన్స్ ముందుకు సడెన్లీ దూసుకొస్తున్నాయి పలు సినిమాలు. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వా వాతియార్.
Also Read : Anaganaga oka Raju : జనవరి 14న థియేటర్ లోకి పండగ సినిమా రాబోతుంది
ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాలు కంప్లీట్ చేసే కార్తీతో నలన్ కుమార్ స్వామి రెండేళ్ల పాటు చెక్కిన ఫిల్మ్ వా వాతియార్. షూట్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రావాల్సి న ఈ సినిమా… కొన్ని స్ట్రగుల్స్ వల్ల డిసెంబర్ 12కి పోస్ట్ పోనైంది. అప్పటికీ ఇష్యూ సాల్వ్ కాకపోవడంతో మళ్లీ వాయిదా వేసింది టీం. ఎప్పుడైతే జన నాయగన్ రిలీజ్ పోస్టుపోన్ అయిందో .. వా వాతియార్ సమస్యల్ని చక్కదిద్దుకుని జనవరి 14 నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
Also Read : BharthaMahasayulakuWignyapthi : రవితేజ ‘భర్త మహశయులకు విజ్ఞప్తి’ ఓవర్సీస్ రివ్యూ..
ఇక పొంగల్ రేసులోకి ఎంటరయ్యాడు జీవా. తలైవర్ తంబీ తలైమయిల్ తొలుత జనవరి 30న రిలీజ్ అనుకోగా.. జన నాయగన్ వాయిదాతో ప్రీ పోన్ అయ్యింది. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ పొలిటికల్ డ్రామా. పొంగల్ బరిలోకి దిగుతోంది పాన్ ఇండియా ఫిల్మ్ ద్రౌపది 2. షామిలీ, షాలిని బ్రదర్ రిచర్డ్ రిషి- జీ మోహన్ కాంబోలో తెరకెక్కిన హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ద్రౌపది2 జనవరి 15న రిలీజ్ అవుతోంది. 2020లో వచ్చిన ద్రౌపదికి ప్రీక్వెల్. తొలుత దీన్ని పాన్ ఇండియా భాషల్లో.. భారీ లెవల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తమిళ తంబీలకు మాత్రమేనని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి పక్కా వస్తా అంటూ ఫ్యాన్స్‌కు మాట తప్పాడు విజయ్. అందుకే తన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి తేరీ రీ రిలీజ్‌తో రాబోతున్నాడు. 2016లో రిలీజైన ఈ ఫిల్మ్ వచ్చి దాదాపు 10 ఏళ్లు కావడంతో జనవరి 15న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. మరి ఈ ఏడాది కూడా అనుకోకుండా రేసులోకి వచ్చిన ఏదైనా సినిమా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో లెట్స్ సీ
