Director Hari:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు. తండ్రి మృతితో హరి ఇంట విషాదం నెలకొంది. ఇక గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని జిల్లాలోని వారి స్వగృహమైన కాచనవెల్లిలో అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకువెళుతున్నారు. విఏ గోపాలకృష్ణన్ కు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమిజ్ అనే చిత్రం ద్వారా హరి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తరువాత సామీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇదే సినిమాను తెలుగులో నందమూరి బాలకృష్ణ లక్ష్మీ నరసింహ పేరుతో రీమేక్ చేశాడు.
Poonam Kaur: నేను కూడా ఆ బ్యాచ్ లో చేరిపోతా..
ఇక సూర్యతో సింగం చిత్రాన్ని తెరకెక్కించి తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక హరి.. నటుడు విజయ్ కుమార్ అల్లుడు అని చాలా తక్కువమందికి తెలుసు. విజయ్ కుమార్ రెండో కూతురు ప్రీతి విజయ్ కుమార్ ను వివాహమాడాడు. ప్రస్తుతం హరి .. విశాల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. హరి తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.