Site icon NTV Telugu

Simbu: కారుతో గుద్ది వృద్దుడిని చంపిన స్టార్ హీరో డ్రైవర్ అరెస్ట్

simbu

simbu

కోలీవుడ్ స్టార్ హీరో శింబు కుటుంబం చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారునడిపి ఒక వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వం ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 అర్ధరాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్, తన మనవరాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇక ఈ విషయాన్ని గమనించినా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపడంతో వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇక ఈ విషయం గమనించిన రాజేందర్ వెంటనే కారు ఆపి ఆ వృద్ధుడిని హాస్పిటల్ కి తీసుకెళ్లామని డ్రైవర్ కి చెప్పి వేరే కారులో ఇంటికి చేరుకున్నారు. గత 5 రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వృద్ధుడు గతరాత్రి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు శింబు డ్రైవర్ పై కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. కాగా ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version