Site icon NTV Telugu

Tamannah: బాహుబలి సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా…?

Whatsapp Image 2023 06 14 At 2.14.19 Pm

Whatsapp Image 2023 06 14 At 2.14.19 Pm

దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లారు రాజమౌళి.కాగా ఈ సినిమాలో తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు అంతగా ఫేమస్ కాలేదు.. ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.తమన్నా. ఈ సందర్భంగా తమన్నా చెబుతూ .. తాను యాక్షన్ చిత్రాల్లో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదని చెప్పుకొచ్చింది తమన్నా. బాహుబలి సినిమా విషయంలో  ప్రభాస్ మరియు రానాకు ఆ క్రెడిట్ దక్కడం మాత్రం న్యాయమని ఆమె వెల్లడించింది. ఎందుకంటే ఆ సినిమా కోసం వాళ్లిద్దరూ చేసిన దానితో పోలిస్తే తన పాత్ర ఎంతో తక్కువని తెలిపింది. అయినప్పటికీ అలాంటి భారీ సినిమాలో తాను పోషించిన అవంతిక పాత్రకు లభించిన క్రేజ్ కి అందరికి కృతజ్ఞతలు తెలిపింది. ఇకపోతే గత ఏడాది ఈమె ఎఫ్ 3 మరియు గుర్తుందా శీతకాలం వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. సినిమాల తో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఎంతో బిజీ గా గడుపుతోంది మిల్క్ బ్యూటీ. ఈ మధ్యనే తాను నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ తో ఆమె బోల్డ్ సీన్స్ లో కూడా నటించింది. అంతే కాకుండా ఈ మధ్య వీరిద్దరూ రిలేషన్ లో వున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలు నిజమే అంటూ ఒక స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది తమన్నా.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.. అలాగే తలైవా రజినీకాంత్ తో నటించిన జైలర్ సినిమా ఆగస్టులో విడుదల కానున్నట్లు సమాచారం.

Exit mobile version