NTV Telugu Site icon

Tamannaah : కోపం వస్తే తెలుగులోనే తిడుతాను.. తమన్నా షాకింగ్ కామెంట్స్

Tamannah

Tamannah

Tamannaah : తమన్నా చాలా రోజుల తర్వాత తెలుగులో మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే తమన్నా తాజాగా చేసిన కామెంట్లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ రోజు ఓదెల-2 మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

Read Also : Raashi khanna : రాశిఖన్నా అందాల జాతర

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. నన్ను చాలా మంది తెలుగు అమ్మాయి అనుకుంటారు. నేను కూడా దానికి చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నాకు ఏదైనా ఎమోషన్ వస్తే కచ్చితంగా తెలుగులోనే దాన్ని చూపిస్తాను. కోపం వచ్చినా సరే తెలుగులోనే తిడతాను. అందుకే నాకు తెలుగు లాంగ్వేజ్ అంటే అంత ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఓదెల-2 మీ అందరికీ నచ్చేలా తీశామని.. కచ్చితంగా ఈ సినిమాను చూసి అందరూ తనను తిట్టుకుంటారని తెలిపింది. ఆమె చేసిన తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.