మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్నదట. హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నాకు అవకాశాలు తగ్గినప్పటికీ టీవీ షోలు, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరీర్‌ను బిజీగా మలుచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతుందని, ఇప్పటికే వరుడిని కూడా ఇంట్లో వాళ్ళు చూశారని టాక్ నడుస్తోంది.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ” పెళ్లి తప్పకుండ చేసుకుంటా.. దానికి ఇంకా రెండేళ్లు టైమ్ ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. దీంతో అమ్మడి పెళ్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా పలు తెలుగు సినిమాల్లో నటిస్తుంది.
